- Advertisement -
హైదరాబాద్ : ఇటీవల కలకత్తాలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ బుద్దిష్ట్ టూర్ ఆపరేటర్లు నిహించిన అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ పర్యాటక శాఖకు “ టూరిజం మిత్ర అవార్డు ” వచ్చింది. తెలంగాణ తరఫున బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య పాల్గొని ఈ సందర్భంగా రాష్ట్రం లో బుద్ధిజం పూర్వ వైభవానికి తీసుకుంటున్న కార్యక్రమాలను ఈసదస్సులో వెల్లడించి టూరిజం మిత్ర అవార్డును సాధించారు. ఈ సందర్భంగా బుధవారం నాడు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్‌ను మర్యాద పూర్వకంగా కలువగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ మేరకు మల్లెపల్లిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బుద్ధవనం ప్రాజెక్టు సిఈఓ సుధాన్ రెడ్డి, చరిత్ర ప్రముఖ పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు వారు మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -