Monday, December 23, 2024

జిహెచ్‌ఎంసిలో కంటోన్మెంట్ విలీనం?…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పోరేషన్ లో కంటోన్మెంట్ ఏరియాల విలీనం ప్రక్రియకు శ్రీకారం మొదలయింది. దీనికోసం విధివిధానాల రూపకల్పనకు కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో రక్షణ శాఖ, రాష్ట్ర మునిసిపల్ సెక్రటరీ తో కలుపుకుని 8 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. స్థిర చరాస్తులతో పాటు ఉద్యోగుల బదలాయింపు ఎలా జరగాలి వంటి అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. దేశంలో అతి పెద్ద కంటోన్మెంట్‌గా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు(ఎస్‌సిబి)కి పేరుంది.

బేగంపేట విమానాశ్రయం, ఆర్మీ ఆంక్షలు, నిధుల కొరత తదితర కారణాల వల్ల కంటోన్మెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. మౌలిక వసతుల కల్పనపైనా, రోడ్ల విస్తరణ వంటివాటిపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఈ నేపథ్యంలో దేశంలోని కంటోన్మెంట్ బోర్డులను స్థానిక సంస్థల్లో విలీనం చేయాలని కేంద్ర నిర్ణయించింది. దీనిపై అభిప్రాయాలు తెలుపాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది.

తెలంగాణ ప్రభుత్వం దీనికి సమ్మతిస్తూ కేంద్రానికి రాసింది. దాంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా విధివిధానాలను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది. జిహెచ్‌ఎంసిలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం అయితే 3000 ఎకరాల విలువైన భూమి బల్దియా పరమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News