Sunday, December 22, 2024

‘కళ్యాణం కమనీయం’ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. (ట్రైలర్)

- Advertisement -
- Advertisement -

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా ‘కళ్యాణం కమనీయం‘. ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘కళ్యాణం కమనీయం’ సినిమా ట్రైలర్‌ను స్టార్ హీరోయిన్ అనుష్క విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే అన్ని భావోద్వేగాలు ఉన్న ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘కళ్యాణం కమనీయం‘ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News