Wednesday, January 22, 2025

అర్షదీప్… బౌలింగ్ మరిచిపోయావా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో అర్షదీప్ ఐద నో బాల్స్ వేయడంతో నెటిజన్లు టోల్స్ చేస్తున్నారు. అర్షదీప్ బౌలింగ్ మరిచిపోయినట్టున్నాడని కామెంట్లు చేస్తున్నారు. అత్యధిక నోబాల్స్ (14) వేసిన బౌలర్‌గా అర్షదీప్ రికార్డు సృష్టించాడు. లంకతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి ఐదు నోబాల్స్ వేయడంతో భారత జట్టు ఓటమిని చవిచూసింది. రెండో ఓవర్‌లో హాట్రిక్ నోబాల్స్ వేయడంతో 19 పరుగులు అదనంగా లంకకు వచ్చాయి. 19వ ఓవర్‌లో కూడా 18 పరుగులు సమర్పించుకున్నాడు. రెండు ఓవర్లు వేసి 37 పరుగులు ఇవ్వడంతో టీమిండియా ఓటమి పాలైంది. ఐదు నో బాల్స్ వేసి 23 పరుగులు సమర్పించుకున్నాడు. భారత జట్టు చివరలో 16 పరుగులతో ఓటమిని చవిచూసింది. ఇదే మ్యాచ్‌లో శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ రెండో నోబాల్స్ వేశారు. ఆసియా కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్షదీప్ క్యాచ్‌ను వదిలేయడంతో టీమిండియా ఓడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News