శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా పగడాల రెమ్మలను గడ్డకట్టించి వాటి లార్వాను నిల్వచేసే ప్రక్రియను కనుగొనగలిగారు. వాతావరణ మార్పుల కారణంగా పగడాల స్థావరాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రక్రియ వాటి ఉనికిని రక్షించుకోడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సముద్రపు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండడంతో సున్నితమైన పర్యావరణ వ్యవస్థలు అస్థిరమౌతున్నాయి. అందువల్ల పగడాల దిబ్బలను ఎలా కాపాడుకోవాలో శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తోంది. గత ఏడేళ్లలో లా నినా తీవ్ర వాతావరణ ప్రభావంతో పగడాల స్థావరాలు నాలుగు సార్లు తమ రంగును ఉనికిని కోల్పోయాయి. గడ్డకట్టించే క్రయోజెనిక్ ప్రక్రియ వల్ల గడ్డ కట్టిన పగడాల రెమ్మలను నిల్వ చేసుకోవచ్చు.
తిరిగి వాటిని ప్రవేశ పెట్టవచ్చు. కానీ ప్రస్తుత ప్రక్రియలో లేజర్స్ వంటి అత్యంత ఆధునిక శాస్త్ర సాంకేతికత చాలా అవసరం. అయితే శాస్త్రవేత్తలు క్రయోమెష్ విధానంలో చాలా తక్కువ వ్యయంతో పగడాల స్థావరాలను భద్రపర్చవచ్చుని చెబుతున్నారు. క్రయోమెష్ అంటే కృత్రిమంగా జాలిని తయారు చేయడం. ఈ మెష్ సాంకేతిక ప్రక్రియను యూనివర్శిటీ ఆఫ్ మిన్నెసోటా కు చెందిన కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పగడాల రెమ్మలపై మొట్టమొదటిసారి పిహెచ్‌డి విద్యార్థి నికొలాస్ జుకోవిచ్ ప్రయోగించారు. ఈ సాంకేతిక విధానం మైనస్ 320.8 డిగ్రీల ఫారన్ హీట్‌లో పగడాల లార్వాను భద్రపరచవచ్చునని పరిశోధకులు వివరిస్తున్నారు.
పగడాల స్థావరాల నుంచి సేకరించిన పగడపు పురుగుపై డిసెంబర్‌లో చేపట్టిన ప్రయోగాల్లో ఆస్ట్రేలియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెరైన్ సైన్సెస్ (ఎఐఎంఎస్ )లో క్రయోమెష్ ప్రక్రియ ద్వారా పగడాల లార్వాను భద్రపర్చ గలిగారు. ఇది సంక్షిప్త వార్షిక వ్యాప్తితో సమానంగా నిరూపించింది. జీవ వైవిధ్య పగడాల పురుగును సేకరించ గలిగితే భవిష్యత్తులో నిజంగా పగడాల స్థావరాలను, లార్వాలను తిరిగి సజీవంగా పునరుద్ధరించుకోగల సాధనాలను కలిగి ఉంటామని స్మిత్ సొనియన్ నేషనల్ జూ సీనియర్‌రీసెర్చి సైంటిస్టు మేరీ హెగెడోర్న్ పేర్కొన్నారు. ఈ సాంకేతికత భవిష్యత్తులో పగడాల స్థావరాల పునరుద్ధరణకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. క్రయోమెష్ ప్రక్రియను గతంతో హవాయిన్ పగడాల స్థావరాలపై ప్రయోగించారు. అయితే ఇందులో భారీ రకం పగడాల రెమ్మలపై ఈ ప్రయోగం ఫలించలేదు. అయితే ఆస్ట్రేలియా లోని “గ్రేట్ బారియర్ రీఫ్ కోరల్ ” ( భారీ పగడాల రెమ్మలు) పై ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. ఈ టెక్నాలజీ జలచర ప్రపంచానికి పునరుజ్జీవం కలిగిస్తుందని ఆశిస్తున్నారు.