Monday, December 23, 2024

విజయ్ దంపతుల విడాకులు… నిజం ఎంత?

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: తమిళ సూపర్‌స్టార్ తళపతి విజయ్ తన భార్య సంగీతకు విడాకులిస్తున్నారా..22 ఏళ్ల వివాహ బంధాన్ని ఆయన తెగతెంపులు చేసుకుంటున్నారా? తమిళ చిత్రపరిశ్రమలో ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. విజయ్, ఆయన భార్య సంగీత విడాకులు తీసుకోవాలని పరస్పరం అంగీకారానికి వచ్చినట్లు విజయ్‌కు చెందిన వికీపీడియా పేజ్ పేర్కొనడంతో ఈ పుకార్లకు బీజం పడింది. ప్రస్తుతం దక్షిణాదిలో నెటిజన్ల మధ్య ఇదే ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. అయితే..ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని విజయ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ పుకార్లు ఎలా పుట్టాయో కూడా అర్థం కావడం లేదని వారు అంటున్నారు. విజయ్ భార్య సంగీత ప్రస్తుతం అమెరికాలో తన ఇద్దరు పిల్లలతో కలసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ దంపతులకు ఇద్దరు పిల్లలు..జేసన్ దివ్య. 1996లో బ్రిటన్‌లో ప్రేమలో పడిన విజయ్ సంగీత 1999 ఆగస్టు 25న వివాహం చేసుకున్నారు. సంగీత సొర్ణలింగం శ్రీలంకకు చెందిన తమిళ పౌరురాలు. తామిద్దరం విడిపోతున్నట్లు విజయ్ కాని, సంగీత కాని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. విజయ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన వారిసు తమిళ చిత్రం ప్రమోషన్‌లో ఉన్నారు. తెలుగులో వారసుడుగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానున్నది. రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News