Monday, November 25, 2024

ఎన్టీపిసి చైర్‌పర్సన్‌కు తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్టు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్టీపిసి చైర్‌పర్సన్‌కు కోర్టు ధిక్కారం కింద తెలంగాణ హైకోర్టు విధించిన రెండు నెలల జైలు శిక్షపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్, న్యాయమూర్తులు పి.ఎస్.నరసింహా, జె.బి.పార్ధివాలాతో కూడిన ధర్మాసనం ఎన్టీపిసి చీఫ్ తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టు ఉత్తర్వుపై స్టే ఇవ్వాలని పెట్టుకున్న వినతిని పరిగణనలోకి తీసుకుంది. ‘హైకోర్టు ఉత్తర్వుపై మేము స్టే ఇస్తున్నాము’ అని ధర్మాసనం తెలిపింది.

దీనికి ముందు ఇదే రోజున ఎన్టీపిసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ పెట్టుకున్న అప్పీల్‌ను విచారించడానికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. “కొందరు నాన్‌ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల నియామకంకు సంబంధించిన కేసులో కోర్టు ధిక్కరణ పాల్పడినందుకు గాను ఎన్టీపిసి చైర్‌పర్సన్‌కు రెండు నెలల జైలు శిక్షను విధించిన కేసు ఇది’ అని ఆయన మధ్యాహ్నానికి ముందు కోర్టుకు తెలిపారు.

‘మేము ఈ కేసును విచారిస్తాము’ అని ధర్మాసనం హామీ ఇచ్చింది. అంతేకాక పిటిషన్ కాపీలను మూడింటిని న్యాయమూర్తులకు సమర్పించాల్సిందిగా న్యాయవాదిని కోరింది. తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 31న కోర్టు ధిక్కరణ కింద సింగ్‌కు శిక్ష విధించింది.

Gurudeep Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News