Friday, November 22, 2024

జపాన్‌లో జంగ్లీ కరోనా

- Advertisement -
- Advertisement -

వైరస్‌తో ఒక్కరోజే 456 మంది మృతి

టోక్యో : జపాన్‌లో కోవిడ్ తీవ్రదశకు చేరింది. అక్కడ ఈరోజు (జనవరి 6)న ఒక్కరోజు 456 మంది కోవిడ్‌తో మృతి చెందారు. ఇది ఈ చిన్నదేశంలో అత్యంత గరిష్ట కోవిడ్ మృతుల రికార్డుగా మారింది. చైనా స్థాయిలోనే ఇప్పుడు జపాన్‌లోనూ కరోనా తీవ్రత ఉందని వైరస్ సోకిన వారి సంఖ్య, మృతుల సంఖ్యతో స్పష్టం అయింది. గడిచిన డిసెంబర్ చివరి నాటికి జపాన్‌లో 7688 మంది కోవిడ్‌తో మృతి చెందారు. అంతకు ముందు కరోనా వైరస్ ఉధృతి దశలో ఆగస్టులో 7329 మంది కరోనాతో చనిపోయిన రికార్డు ఉంది. దీనిని డిసెంబర్ నెల రికార్డు దాటేసింది. ఇప్పుడు శుక్రవారం ఒక్కరోజే కరోనాతో దాదాపు 500 మంది వరకూ చనిపోవడంతో ఏండ్లు గడుస్తున్నా కరోనా వీడని పీడకల పరిస్థితిని మిగిల్చింది.

ఒక్కరోజే 456 మంది కోవిడ్‌తో చనిపోయిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. నూతన సంవత్సర వేడుకల హంగామాలతో నిబంధనలను బేఖాతరు చేయడంతో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని ముందుగా వెలువడ్డ హెచ్చరికలు జపాన్‌లో నిజం అయ్యాయి. ఇక దేశంలో గురువారం కరోనా కేసుల సంఖ్య 18,638 వరకూ పెరిగింది. దేశంలో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారి సంఖ్య మరుసటి రోజుకు అంటే శుక్రవారానికి 2,45,542కు చేరింది. టోక్యోలోనే 20,720 కొత్త కేసులు నమోదు అయ్యాయి. టోక్యోలో కూడా ఎక్కువ మంది వైరస్‌కు గురవుతున్నారు. తీవ్రస్థాయి వైరస్ లక్షణాలతో టోక్యోలో 53 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News