Friday, December 20, 2024

చిన్నారి చిరునవ్వుకు కారణమైన రైల్వే శాఖ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రైల్లో తన ఇష్టమైన బొమ్మను కోల్పోయిన చిన్నారికి రైల్వే సిబ్బంది తిరిగి దానిని ఆ పాప వద్దకు చేర్చడంతో ఆ చిన్నారి ఆనందానికి అవదులులేకుండా పోయాయి. ఈ సంఘటనతో ఆ చిన్నారి మధురానుభూతిని పొందడంతో ఆమె తల్లిదండ్రులు రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 04వ తేదీనభుసిన్ పట్నాయక్ అనే ప్రయాణికుడు రైలు నం. 07030, సికింద్రాబాద్- టు అగర్తలా ప్రత్యేక రైలులో ‘కోచ్ నంబర్ B-2, సీటు నంబర్- 10,11లలో ప్రయాణం చేశాడు. ఇదే రైలులో ఒక చిన్నారి తన తల్లిదండ్రులతో అదే కోచ్‌లో ప్రయాణిస్తోంది. అనుకోని పరిస్థితిల్లో ఆ చిన్నారి తనకు ఇష్టమైన ఒక బొమ్మను పోగొట్టుకుంది.

ఇది గమనించిన భూసిన్ పట్నాయక్ ఆ చిన్నారి పోగొట్టుకొన్న బొమ్మను తిరిగి ఇప్పించాలన్న ఆలోచనలో భాగంగా రైల్వేకు సంబంధించిన మద్దద్ అనే యాప్ ద్వారా 139 అనే నెంబర్‌కు ఫోన్ చేసి ఈ విషయాన్ని చేరవేశాడు. ఫిర్యాదు దారుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆ చిన్నారి కుటుంబానికి సంబంధించిన వివరాలను రైల్వే శాఖ రాబట్టింది. తోటి ప్రయాణికుడి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం రైల్వే సిబ్బంది సదరు చిన్నారికి సంబంధించిన వివరాలను సికింద్రాబాద్ రైల్వే కౌంటర్ ద్వారా రిజర్వేషన్ చార్ట్ నుంచి చిరునామా ప్రయాణికుడి పూర్తి వివరాలు రాబట్టడంలో సఫలీకృతమయ్యింది.

పాపకు తిరిగి ఆ బొమ్మను ఇప్పించడం సంతోషకరం..

దీనిపై దృష్టి సారించిన రైల్వే శాఖ చిన్నారి పోగొట్టుకున్న బొమ్మను రైల్వే శాఖ సిబ్బంది గుర్తించి ఆ బొమ్మను తల్లిదండ్రులు మోహిత్ ర్జా, శ్రీమతి నస్రీన్ బేగంబేగం, గ్రామం ఖాజీగావ్ , ఉత్తర్ దినాజ్ పూర్ జిల్లా గ్రామం అలియాబరి స్టేషన్‌కు 20 కి.మీ దూరంలో ఉన్నట్టు గుర్తించి వారికి ఆ బొమ్మను అందచేసింది. దొరికిన చిన్నారి బొమ్మను రైల్వే సిబ్బంది ఆ ఇంటికి వెళ్లి దానిని అందించారు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సందర్భంగా చిన్నారి తండ్రి మోహిత్ మాట్లాడుతూ తన 19 నెలల చిన్నారికి ఎంతో తనకు ఎంతో ఇష్టమైన బొమ్మను పోగొట్టుకొని రోధిస్తున్న సన్నివేశం నన్ను ఎంతో బాధించాయి. కానీ రైల్వే శాఖ సిబ్బంది మా పాపకు తిరిగి ఆ బొమ్మను ఇప్పించి మాకు సంతోషం కలిగించేలా వ్యవహారించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News