Monday, December 23, 2024

‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ విడుదల.. థియేటర్లో ఇక పూనకాలే..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ అభిమానులతోపాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాడు ‘వాల్తేరు వీరయ్య’.

ఇక, థియేటర్లలో పూనకాలే అన్నట్టుగా ట్రైలర్ ఉండడంతో ఫ్యాన్ పండుగా చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవీశ్రీ అందించిన సాంగ్స్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News