Sunday, January 19, 2025

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రాచకొండ సిపి తన క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా, బాలాపూర్‌కు చెందిన ఎండి రషీద్ ఖాన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ధూల్‌పేటకు చెందిన సంజయ్ సింగ్ పరారీలో ఉన్నాడు. రషీద్ గతంలో ఇళ్లల్లో దొంగతనాలు తదితర నేరాలు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 కేసులు ఉన్నాయి.

నిందితుడు గంజాయిని ధూల్‌పేటకు చెందిన సంజయ్ సింగ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి రూ.300 నుంచి రూ.500లకు విక్రయిస్తున్నాడు. మరో కేసులో మీర్‌పేటకు చెందిన షేక్ ఫైసల్, టామ్ అలియాస్ చింటూ గంజాయి విక్రయిస్తున్నారు. ఫైసల్ గంజాయిని ఫైసల్ వద్ద కొనుగోలు చేసి బాలాపూర్, మీర్‌పేట ప్రాంతంలో విక్రయిస్తున్నాడు. కాగా బాలాపూర్‌కు చెందిన షేక్ జఫార్ మొబైల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అడ్డు భాయ్ వద్ద గంజాయి సరఫరా చేస్తున్నాడు. అడ్డుభాయ్ వద్ద గంజాయిని షేక్ జఫార్ కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. ముగ్గురు నిందితులు మీర్‌పేట, బాలాపూర్‌లో అవసరం ఉన్న వారికి గంజాయి విక్రయిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు సుధాకర్, మహేందర్ రెడ్డి, కిరణ్‌కుమార్ తదితరులు కలిసి పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News