Monday, December 23, 2024

13 నుంచి 17 వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో పాఠశాలలకు ఈ నెల 13 నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17 వరకు సెలవులు కొనసాగనుండగా, ఈ నెల 18వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తం ఐదు రోజులు ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఈ నెల 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ ఉండగా, 17 వరకు సెలవులు కొనసాగనున్నాయి.
14 నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులు ఇచ్చింది. తిరిగి ఈ నెల 17న కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రకటన విడుదల చేశారు. సెలవుల్లో జూనియర్ కాలేజీల్లో తరగతులు నిర్వహించవద్దని, ఎక్కడైనా తరగతులు నిర్వహించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News