Monday, December 23, 2024

చైనాలో రోడ్డు ప్రమాదం: 17 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

బీజింగ్: చైనాలోని జియాంగ్సీలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాంచుంగ్ కౌంటీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందగా 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చలికాలంలో ముంచు కురువడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. మంచు ఎక్కువగా కురవడంతో ముందున్న వాహనాలు కనిపించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. మంచు కురుస్తున్నప్పుడు అతి వేగం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. గిజో ప్రొవెన్స్‌లో సెప్టెంబర్ నెలలో బస్సు ప్రమాదంలో 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News