- Advertisement -
చండీగఢ్: హర్యానా, పంజాబ్‌లలో చలిగాలులు బలంగా వీస్తున్నాయి. ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రత చాలా ప్రదేశాలలో సాధారణం కంటే తక్కువకు పడిపోయాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత కూడా పడిపోయింది. హర్యానా, పంజాబ్‌లో ఆదివారం పొగ మంచు దట్టంగా కమ్ముకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెల్లవారు జామున అయితే ముందున్నవి కూడా కనబడనంతగా పొగమంచు కమ్ముకుంది. కాగా హిసార్, హర్యానాలో కొంకర్లు పోయే చలి తిష్టవేసుకుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 1.4 డిగ్రీల సెల్సియస్ కన్నా కింద నమోదయింది. సిర్సా, భివాని, రోహతక్, నార్‌నౌల్, అంబాలాలో చలి విపరీతంగా ఉంది. పంజాబ్‌లోని ఆదంపూర్‌లో తీవ్ర చలిగాలలు వీస్తున్నాయి. రూప్‌నగర్‌లో కూడా తీవ్ర చలిగాలలు వీస్తున్నాయి. ఇక బఠిండా, గురుదాస్‌పూర్‌లో చలి కొరుక్కుతింటోంది. లుధియానా, అమృత్‌సర్, పఠాన్‌కోట్, ఫరీద్‌కోట్, మొహాలిలో కూడా చలి తీవ్రంగా ఉంది.
- Advertisement -