Tuesday, January 21, 2025

కృష్ణబిలం అయస్కాంత క్షేత్రంపై విస్ఫోటనం కుదుపు

- Advertisement -
- Advertisement -

దాదాపు 236 మిలియన్ కాంతి సంవత్సరాలకు అవతల ఉన్న నక్షత్ర మండలం నుంచి అరుదైన విస్ఫోటనం కేంద్ర కృష్ణబిలం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని ఆకస్మికంగా ఓ కుదుపు కుదపవచ్చని అంతర్జాతీయ పరిశోధకుల బృందం అంచనా వేసింది. నాసా నెయిల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ , ఐరోపా స్పేస్ ఏజెన్సీ ఎక్స్ ఎంఎం న్యూటన్ శాటిలైట్ నుంచి అల్ట్రా వయెలెట్ (అతినీల లోహిత కిరణాలు) ఎక్స్‌రే సాధనాలు ఉపయోగించి ఈ మేరకు గణాంకాలను సేకరించింది. ఇతర మార్గాల అణుధార్మికత వంటి అధ్యయనాలను చేయ గలిగింది. గామా కిరణాలపై పరిశోధనలు సాగిస్తున్న నాసా స్విఫ్ట్ స్పేస్ అబ్జర్వేటరీ ఈ నక్షత్ర మండలాన్ని 2018 మే లో మొదట కనుగొన గలిగింది. అతినీల లోహిత కిరణాలు 12 సార్లు వెల్లువలా వెలువడి తరువాత నిదానంగా క్షీణించాయని పరిశోధకులు చెప్పారు.

ఇది అంతకు ముందు గమనించని ఉన్నత స్థాయికి సంకేతంగా పేర్కొన్నారు. జూన్‌లో నక్షత్ర కూటమికి చెందిన అత్యంత శక్తివంతమైన ఎక్స్‌రే వెల్లువ అదృశ్యమైంది. పెద్ద నక్షత్ర మండలాలు తమ కేంద్రం మధ్యలో తరచుగా భారీ కృష్ణబిలాలకు చోటిస్తుంటాయి. ఈ కృష్ణబిలాలపై పదార్ధ సముదాయం పడితే ఆ బిలం చదునైన ప్రక్రియలో విస్తారంగా దాన్ని గ్రహిస్తుంది. ఆ పదార్థం మెల్లగా సుడులు తిరుగుతూ లోపలికి జారుకుంటుంది. వేడెక్కి అతి నీల లోహిత కిరణాలను , తక్కువ శక్తి కలిగిన ఎక్స్‌రే కాంతిని విడుదల చేస్తుంది. కృష్ణబిలం సమీపాన ఉన్న వేడి అణువుల సముదాయ మేఘాన్ని కరోనా అని పిలుస్తారు. ఈ కరోనా నుంచే అత్యంత శక్తివంతమైన ఎక్స్‌రేలు వెలువడతాయి. కృష్ణబిలం నుంచి వెలువడే ఉద్గారాల కాంతి, ఎంతమేరకు పదార్థం అందులోకి వెళ్లిందో దానిపై ఆధారపడి ఉంటుంది.

ఈ ఉద్గారాలు నక్షత్రం ద్వారా ప్రేరేపింపబడి కృష్ణబిలానికి అతి చేరువగా వెళ్తుందని , వాయువు ప్రవాహాన్ని ధ్వంసం చేస్తుందని, ఇది వరకు అనుకునేవారు. ఇప్పుడీ విస్ఫోటనం కన్నా ఆ ప్రక్రియ వేగంగా నిర్వీర్యమౌతుందని తాము చూపించ గలిగామని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రక్రియలో అత్యంత శక్తివంతమైన ఎక్స్‌రే ఉద్గారాలు అదృశ్యం కావడం , శాస్త్రవేత్తలకు ఓ ఆధారాన్ని అందించింది. కృష్ణబిలం అయస్కాంత క్షేత్రం వేడి అణువులను సృష్టించి కరోనాను స్థిరంగా ఉంచుతుందని అందువల్ల ఎలాంటి అయస్కాంత మార్పులైనా ఎక్స్‌రే లక్షణాలపై ప్రభావం చూపుతాయని కెనరీ ఐలాండ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్త జోసెఫా టెకెర్రా గొంజలెజ్ వివరించారు. ఉత్తర ద్రువంగా మారినప్పుడు అలాగే అటుఇటు మార్పులు చెందినప్పుడు అయస్కాంత క్షేత్ర తిరోగమనాన్ని అధ్యయనం చేయడానికి అనువుగా ఉంటుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News