Sunday, December 22, 2024

కలెక్టర్‌ తీరుతో జిల్లా అభివృద్ధికి శాపం

- Advertisement -
- Advertisement -

వికారాబాద్‌ : జిల్లా కలెక్టర్‌ నిఖిలపై జడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతారెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. జిల్లాకు గుండేకాయలాంటి అధికారి ముఖ్యమైన ప్రభుత్వ సమీక్ష సమావేశాలకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో నెలకొన్న భూ సమస్యలు పరిష్కరించాల్సిన కలెక్టర్‌ రైతు సమస్యలు గాలికొదిలేసి వాళ్ల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. ఆదివారం వికారాబాద్‌ కలెక్టరేట్‌లో కంటివెలుగు సమావేశానికి జిల్లా మంత్రి, తాను, జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరవుతే కలెక్టర్‌ ఎందుకు గైర్హాజరయ్యారని ప్రశ్నించారు. జిల్లా సమాగ్ర అభివృద్ధిపై చర్చించే జడ్పీ సాదారణ సమావేశాలకు కూడా ఉద్దేశపూర్వకంగానే రావడంలేదని అన్నారు.

గత జనరల్‌ బాడీ సమావేశానికి రాకుంటే జిల్లా మంత్రి వారం రోజుల్లో కలెక్టర్‌తో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికి సమావేశం ఏర్పాటుకు ముందుకు రాకుండా తప్పించుకు తురుగుతున్నారన్నారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజల సమస్యలు చెబితే ఎవరి మాట వినకుండా ఒక నియంతలా వ్యవహరిస్తుందని ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కనీస గౌర వం ఇవ్వక పోవడమేంటి అని ప్రశ్నించారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు కలెక్టర్‌ కార్యాలయానికి వెళితే డోర్ దగ్గర గంటల తరబడి నిలబెట్టి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా అవమానం చేసారని గుర్తుచేశారు. కలెక్టర్ అవినీతిపై నిలదీసే ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, మీడియా ప్రతినిధులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.

ఒక్క రోజైన గ్రామాల్లో పర్యటించారా..? ఏనాడైనా కనీసం మండల కేంద్రాలకైనా వెళ్ళారా…? అని నిలదీశారు. జడ్పిటీసీలు ఎంపీపీలు? రైతులు తమ సమస్యలపై కనీసం దరఖాస్తు చేసుకుందామని వస్తే కలిసే తీరిక లేదా అని అన్నారు. అలాంటప్పుడు మా జిల్లాలో మీరు పనిచేయడం ఎందుకు..? ఇక్కడ ఏమైనా ప్రత్యేక అధికారి పాలన నడుస్తుందా…? ఎం తమాషాగా ఉందా..? మీ తీరువలన మా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని మండిపడ్డారు. ఇలాంటి మీలాంటి అధికారి మాకు అవసరం లేదు… త్వరలో జిల్లా ప్రజాప్రతినిధులలతో, రైతులతో కలిసి సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. కలెక్టర్ అవినీతిపట్ల జిల్లాలో ఎంతో మంది రైతుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని, భూముల సెటిల్‌మెంట్లకు సంబంధించి ఆధారాలతో సీఎస్ కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News