Monday, December 23, 2024

పన్నులు గుంజినా ఫాయిదా ఏది?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రపంచంలో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) పరంగా భారతదేశం ఐదో స్థానానికి చేరింది. అయితే దేశీయంగా పన్ను రాబడితో పోలిస్తే మాత్రం జిడిపి పన్ను రాబడి మధ్య వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వ హాయాంలో భారతదేశం జిడిపి వృద్ధి రేటు పరిశీలిస్తే, దేశీయ ఆదాయ పన్నులు పెరిగినంతగా వృద్ధి రేటు పెరగడం లేదు. గత ఎనిమిదేళ్ల మొత్తం జిడిపి గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది. 2014 సంవత్సరంలో రూ.125 లక్షల కోట్ల జిడిపి నమోదవగా, ఇక 2022 సంవత్సరంలో జిడిపి రూ.135.13 లక్షల కోట్లు అంచనా వేశారు. అంటే ఎనిమిది సంవత్సరాల్లో జిడిపి రూ.9.72 లక్షల కోట్లు పెరిగింది. ఇక 2014 సంవత్సరంలో పన్ను రాబడి చూస్తే రూ.11.55 లక్షల కోట్లు నమోదవగా, 2022 సంవత్సరంలో పన్ను రాబడి- రూ.27.57 లక్షల కోట్లుగా ఉంది.

అంటే అంటే 8 సంవత్సరాల్లో పన్ను రాబడి రూ.16 లక్షల కోట్లు పెరిగింది. ఈ గణాంకాల ఆధారంగా పరిశీలిస్తే, పన్ను రాబడి పెరిగినంతగా దేశ జిడిపి వృద్ధి రేటు పెరగలేదు. కరోనా మహమ్మారి వల్ల జిడిపి అంచనాలు తలకిందులు అయినప్పటికీ, పన్ను రాబడి మాత్రం ఏకదాటిగా పెరుగుతోంది. అందుకే ఏనిమిదేళ్ల కాలంలో పన్నుల ఆదాయంలో వృద్ధి గణనీయంగా ఉంది. పన్నుల మాదిరిగా వేగంగా జిడిపి వృద్ధి రేటులో పురోగతి కనిపించడం లేదు. 2020-21 సంవత్సరంలో వాస్తవ జిడిపి లేదా స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 135.13 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 2019-20కి గాను మొదటి సవరించిన జిడిపి అంచనా 145.69 లక్షల కోట్లుగా ఉంది. 2019-20లో జిడిపి వృద్ధి -7.3 శాతంగా అంచనా వేశారు. అయితే గతేడాది డిసెంబర్ సమీక్షలో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) 202223 జిడిపి వృద్ధి అంచనా 7 శాతం నుండి 6.8 శాతానికి తగ్గించారు. అంటే జిడిపి ఇంకా తగ్గుతూ ఉంటే రాబడి మాత్రం పెరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News