Saturday, November 23, 2024

మరో రెండు జోషిమఠ్‌లు!

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : జోషిమఠ్ ఒక్కటే కాకుండా ఉత్తరకాశీ, నైనిటాల్‌లకు కూడా కుంగిపోయే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరించారు. హిమాలయ శ్రేణువుల మధ్య ఒదిగి ఉండే ప్రఖ్యాత పర్యాటక, యాత్రా స్థలాలకు భూమి కుంగిపోవడం, పగుళ్లు ఏర్పడటం వంటి పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. భూ ప్రాంతం పర్వతాల మధ్య ఉందా? నదులు ప్రవాహాల నడుమ ఉందా? అనేది పరిగణనలోకి తీసుకోవడం లేదు. పర్యావరణ సంబంధిత విషయాలను గాలికి వదిలిపెడుతున్నారు. దీనితోనే జోషిమఠ్ ఒక్కటే కాకుండా ఉత్తరకాశీ, నైనిటాల్‌కు కూడా ముప్పు పొంచి ఉందని , మానవీయ పనులు, పలు స్థాయిల నిర్మాణ కార్యక్రమాలు అశాస్త్రీయంగా చేపట్టడం అనర్థాలకు దారితీస్తోందని హెచ్చరించారు. భూమి కూరుకుపోయే పరిణామం సార్వత్రికం కాకుండా చూసుకోవల్సి ఉంది.

పలు ఇతర పట్టణాలు , ప్రాంతాలకు నేలబొరియలు ఏర్పడే దశ ఏర్పడుతోందని ఇప్పుడు జోషిమఠ్‌లో నెలకొన్న దుస్థితి దశలో ఆందోళన వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేని వర్షాలు ఇటీవలి కాలంలో వరదలతో ఈ ప్రాంతాలలో భూమి పొరలలో ప్రకంపనలు, నేల పటిష్టత దెబ్బతినడం సర్వసాధారణ పరిణామం అయింది. ఇక మానవ ప్రగతి దిశలో చేపడుతున్న పలు నిర్మాణ కార్యక్రమాలు ఈ ప్రాంతపు నేలపట్టు జారేలా చేస్తోంది. అయితే ఉన్నట్లుండి జోషిమఠ్ ఇతర ప్రాంతాలలో మట్టికూరుకుపోవడం, పగుళ్లు ఏర్పడటానికి కారణం ప్రధాన కేంద్రీకృత ఒత్తిడి పరిణామం ( ఎంసిటి2) అని నిపుణులు తేల్చారు. ఈ పరిణామం భూ అంతర్ పొరల్లోని మార్పులతో తలెత్తుతుంది. హిమాలయ సానువుల వెంబడి భూమిపొరల్లోని భారతీయ రాతి పొరలు క్రమేపీ యూరోసియన్ ప్లేట్ల వైపు వెళ్లుతూ ఉండటం, ఈ దశలో కలిగే రాపిడితో పలు ప్రాంతాలకు ముప్పు వాటిల్లింది. ముందు ముందు ఎప్పుడైనా ఈ పరిస్థితి ఇక్కడ పెను భూకంపాలకు దారితీస్తుంది.

ఇంతవరకూ నిద్రాణంగానే ఉన్న ఎంసిటి 2 ఇప్పుడు తిరిగి తలెత్తింది. దీనితో పలు ప్రాంతాలలో భూమి కుంగిపోతోంది. అయితే ఈ భూగర్భ పరిణామం ఎప్పుడు తలెత్తుతుందనేది ఖచ్చితంగా ఏ భూగర్భ శాస్త్రవేత్త నిర్థారించలేరు. అయితే ఏఏ ప్రాంతాలు ఇటువంటి పరిస్థితికి లోనవుతాయనేది చెప్పగలరని వివరించారు. కొన్ని ప్రాంతాలలో ఇటువంటి పరిస్థితి ఉంటుందని తాము పలుదఫాలుగా హెచ్చరిస్తూ వచ్చామని, అయితే వీటి గురించి ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిపారు. మనం చుట్టూ ఉన్న ప్రకృతితో పోరాడవచ్చు కానీ భూగర్భశాస్త్రాన్ని ఏమీ చేయలేమని కుమౌన్ యూనివర్శిటీలో జియాలజీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ బహద్దూర్ సింగ్ కొటిలా తెలిపారు. నైనిటాల్‌లో కూడా ఇటువంటి పరిణామం రాబోతోందని విశ్లేషించారు. నైనిటాల్ ఇతర ప్రాంతాలకు తలెత్తే ముప్పు గురించి 2016 లోనే శాస్త్రీయ పరిశోధనల క్రమంలో వెలువడ్డ ఫలితాలను తెలియచేయడం జరిగింది. ఇప్పుడు ఆరు సంవత్సరాల తరువాత ఇది నిజం అయిందని తెలిపారు.

ఏడాదిగా పగుళు…్ల పట్టించుకున్న ఆనవాళ్లు లేవు
జోషిమఠ్ స్వామి ఆవేదన ….ఇళ్ల సందర్శన

తామంతా ఎంతో పవిత్రంగా భావించే జోషిమఠ్‌కు ఇప్పటి పరిస్థితికి ప్రభుత్వాల చేతకాని తనమే కారణం అని ఆ ప్రాంతపు స్వామి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. బద్రీనాథ్‌కు ముఖద్వారం అయిన ఈ ప్రాంతానికి పగుళ్లు సంవత్సరం క్రితం గుర్తించారని అయితే పట్టించుకోలేదు. తాను ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్లు తెలిపారు. వందలాది ఇళ్లకు పగుళ్లు పట్టిన విషయాన్ని తాను సచిత్రంగా తెలిపానని, ఇది జాతీయ విపత్తు అవుతుందని చెప్పానని, కానీ ఏమీ జరగలేదని, ఇప్పుడు ఏం జరుగుతున్నదో చూడాలని స్వామి చెప్పారు. జోషిమఠ్‌లో దెబ్బతిన్న ప్రాంతాలను ఈ స్వామి తన శిష్య బృందంతో కలిసి ఆదివారం సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News