Monday, December 23, 2024

భర్తను హత్య చేసి పక్కనే నిద్రించిన భార్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మద్యం మత్తులో వేధిస్తున్నాడని భర్తను భార్య హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నానాజీపూర్ కు చెందిన ఒల్కే రాజు, జ్యోతి దంపతులు శంషాబాద్ లో నివాసముంటున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. రోజువారి కూలిగా వెళ్లే రాజు మద్యానికి బానిసై పనులకు వెళ్తకుండా భర్యను కొడుతుండేవాడు. దీంతో ఇద్దరి మద్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో శనివారం రాజు బాగా మద్యం సేవించి వచ్చి భర్యను, పిల్లలను కొట్టాడు. దీంతో కొపానికి గురైన భార్య రాజు నిద్రపోతుండగా ఆదివారం తెల్లవారుజామున కత్తితో పోడిచి చంపింది. ఆదివారం తెల్లవారు జామున విషయం స్థానికులకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు భార్యను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు పోస్ట్ మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News