Sunday, January 19, 2025

యువతి ప్రైవేట్ వీడియో అప్‌లోడ్..మాజీ ప్రియుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తన మాజీ ప్రేయసికి చెందిన వ్యక్తిగత వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఒక వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. 21 సంవత్సరాల ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు పై సమర్ పరమానిక్(47) అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..సమర్ చాలా ఏళ్లుగా బెంగళూరులో స్వర్ణకారుడిగా పని చేస్తున్నాడు. 2019లో బెంగళూరుకు వచ్చిన బాధితురాలు ఒక బ్యూటీ పార్లర్‌లో పని చేసేది. ఒకే రాష్ట్రానికి చెందిన వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది.

తామిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమెను తన సెల్‌ఫోన్ కెమెరాలో వీడియో తీశాడు సమర్. కొద్ది రోజుల తర్వాత సమర్‌తో తెగతెంపులు చేసుకుని పశ్చిమ బెంగాల్‌కు వెళ్లిపోయిన ఆ యువతి అక్కడ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఉద్యోగం కోసం ఆ జంట తిరిగి బెంగళూరు చేరుకుంది. ఈ విషయం తెలిసిన సమర్ ఆమెకు ఫోన్ చేసి తనతో శృంగారం చేయాలని వేధించసాగాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో తనతో గడిపిన దృశ్యాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో సమర్ అప్‌లోడ్ చేశాడు. దీంతో ఆ యువతి సమర్‌పై పోలీసులపై ఫిర్యాదు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News