మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటి ప్రగతిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేటిగా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ఈ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అ నేక సంస్కరణలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఐటి రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. కా రణంగానే తెలంగాణకు చెందిన ఐటి నిపుణలు దేశ, విదేశాల్లో కీలకమైన పదవుల్లో కొనసాగుతున్నారని కెటిఆర్ అన్నారు. ప్రధానంగా దేశంలో పనిచేస్తున్న ఐటి ఉద్యోగుల్లో 20శాతం హైదరాబాద్ నుంచే పనిచేస్తున్నారని ఆయన వివరించారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు.
భారతదేశంలో మరి న్ని ఐటి ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, ఎమర్జింగ్ టెక్నాలజీల ద్వారా వచ్చే ఉద్యోగాల విషయంలో కంపెనీలు ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలన్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని థ్రిల్ సిటీలో ఐటి పరిశ్రమల ప్రతినిధుల ముఖాముఖి సమావేశానికి మంత్రి కెటిఆర్ హాజరరై మాట్లాడారు. ఐటి రంగంలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. ఏ రాష్ట్రంలోనైనా సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. అలాంటి పాలన సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు. ఫలితంగా కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే తె లంగాణ రాష్ట్రం ఐటిలో ఆశ్చర్యపడే రీతిలో దూ సుకపోతున్నదన్నారు. దీని కారణంగానే రాష్ట్రంలో పె ట్టుబడుల వరద కొనసాగుతోందన్నారు. దేశ, విదేశాలకు చెందిన అనేక సంస్థలు రాష్ట్రానికి క్యూకడుతున్నాయని కెటిఆర్ వివరించారు.
బెంగళూరును దాటేసిన భాగ్యనగరం
పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన నగరమని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆఫీస్‌స్పేస్ వినియోగం విషయంలో బెంగళూరును అనేక పర్యాయాలు హైదరాబాద్ దాటినా, అత్యధికంగా ఉద్యోగాలు కల్పించిన నగరంగా నిలవడం గర్వకారణమన్నారు. ఐటి రంగంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్ దాటిందన్నారు. ఐటిలో గత రెండేండ్లలో కొత్తగా 40 వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఐటి కేవలం ఒకవైపుకే పరిమితం చేయకుండా నగరం నలుమూలకు విస్తరింప చేస్తున్నామని కెటిఆర్ వివరించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం నగరంలో ఉత్తరంవైపు ఐటి రంగాన్ని విస్తరిస్తున్నామన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అద్భుతంగా పనిచేస్తున్నదని ఆయన కితాబిచ్చారు. తొలిరెండు స్పేస్‌టెక్ స్టార్టప్‌లు హైదరాబాద్‌కు చెందినవేనని పేర్కొన్నారు. వీటి కారణంగానే వ్యాపారవేత్తలు హైదరాబాద్ వైపు పెద్దఎత్తున ఆకర్షితులవుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో టి..ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్‌ను అందిస్తామని వెల్లడించారు.
ఐటి రంగానికి సంపూర్ణ సహకారం
ఐటి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని కెటిఆర్ అన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భనించినప్పుడే చాలా స్పష్టంగా చెప్పామన్నారు. గత 8 ఏళ్లుగా ఐటి పరిశ్రమ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పాటుపడుతున్నామని వెల్లడించారు. తొలినాళ్లలోనే ఐటి పరిశ్రమ బలోపేతానికి అవసరమైన చర్యలను తీసుకోవడంపైన దృష్టి సారించామన్నారు. అందుకే ప్రణాళిక బద్ధంగా హైదరాబాద్ లో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించామన్నారు. ప్రధానంగా శాంతి భద్రతల బలోపేతంతో పాటు ఇన్నోవేషన్ ఈకో సిస్టంను మరింత అభివృద్ధి చేశామన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ టి… హబ్‌ను ఏర్పాటు చేశామని కెటిఆర్ వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా వి..హబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. దానితో పాటు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్‌ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రత్యేకంగా శానిటేషన్ హబ్ కూడా ఏర్పాటు చేశామని…. త్వరలో దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైప్ సెంటర్ టి…వర్క్‌ను ప్రారంభం చేయనున్నామన్నారు. దేశానికి గర్వకారణమైన అంతరిక్ష పరిశోధనలలో పనిచేస్తున్న స్కైరూట్, ధ్రువ వంటి స్టార్ట్ అప్ లు హైదరాబాద్ నుంచే ప్రారంభమయ్యాయన్నారు. ప్రస్తుతం అవి విజయవంతంగా వృద్ధిపథంలో దూసుకెళుతున్నాయన్నారు.
టాస్క్ ద్వారా లక్షలాది మందికి శిక్షణ
8 సంవత్సరాల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన టాస్క్ (టిఎఎస్‌కె) ద్వారా 7 లక్షల మందికి పైన యువకులకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ అందించామని కెటిఆర్ తెలిపారు. ఈ శిక్షణ కేవలం ఐటి రంగంలోనే కాకుండా లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాల్లోనూ ఈ శిక్షణ కొనసాగిందన్నారు. రాష్ట్రంలోని పదిలక్షల గృహాలకు ఇంటర్నెట్‌ను అందించే టి-…ఫైబర్ ఈ సంవత్సరం పూర్తవుతుందన్నారు.హైదరాబాద్ నగరంలో ఉన్న మూడువేలకు పైగా వైఫై హాట్ స్పాట్‌ల ద్వారా అందిస్తున్న వైఫై విజయవంతం అయిందన్నారు.
సమాజహితం కోసం పనికిరాని సాంకేతిక పరిజ్ఞానం వృధా
సమాజాహితం కోసం పనికిరాని సాంకేతిక పరిజ్ఞానం వృధా అనే సిఎం కెసిఆర్ ఆలోచన మేరకు పనిచేస్తున్నామని కెటిఆర్ తెలిపారు. పౌరులకు సేవలు అందించే విషయంలో దేశంలోనే తెలంగాణ మీ-సేవా అత్యుత్తమమైనదిగా ఉందన్నారు. పెన్షన్లు, డ్రైవింగ్ లైసెన్స్‌ల రెన్యూవల్, ఇ… -ఓటింగ్ వంటి అనేక ప్రభుత్వ సేవలలో పెద్ద ఎత్తున నూతన టెక్నాలజీలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నదన్నారు. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులతో పాటు సోషల్ ఇన్‌ఫ్రా కూడా బాగా బలోపేతం అయిందన్నరు.గత 8 సంవత్సరాలుగా ఒక నగరంలో అత్యధికంగా మౌలిక వసతులు కల్పించిన నగరంగా హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుందన్నారు. ఇప్పటికే ఎస్‌ఆర్‌డిపి ద్వారా అనేక ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలో సంపూర్ణ మురుగునీటి శుద్ధి వంద శాతం జరుగుతుందన్నారు. ఈ ఘనత దేశంలో ఏ నగరానికి లేదని కెటిఆర్ స్పష్టం చేశారు. 2050 వరకు హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు సరిపడా మౌలిక వసతులను నిర్మాణం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోతో పాటు ఎయిర్‌పోర్టు మెట్రో వంటి మరిన్ని ఇతర ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామన్నారు.
ఇతర ప్రాంతాలకూ ఐటి విస్తరణ
హైదరాబాద్ ఐటి పరిశ్రమను ఇతర ప్రాంతాలకు విస్తరింప చేస్తున్నామని కెటిఆర్ వెల్లడించారు. నగరంలో ఇతర ప్రాంతాలతోపాటు, తెలంగాణలోని ఇతర నగరాలకు కూడా ఐటి పరిశ్రమ తీసుకుపోయే విషయంలో ఐటి సంస్థలు ఆలోచన చేయాలని సూచించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో ఐటి పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన చేశామన్నారు. పలు జిల్లా కేంద్రాల్లో ఐటి టవర్లను నెలకొల్పామన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతాల్లోనూ ఐటి కార్యాలయాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. బాసర ట్రిపుల్ ఐటి వంటి విద్యాసంస్థ, అక్కడున్న విద్యార్థులతో ఐటి కంపెనీలు పని చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఐటి మంత్రిగా కెటిఆర్ ఉండటం గర్వకారణం
ఐటి శాఖ మంత్రిగా కెటిఆర్ ఉండటం ఐటి రంగానికి గర్వకారణమని హైసియా ప్రెసిడెంట్ మనీషా అన్నారు. హైదరాబాద్‌లో ఐటి పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చేందుతున్నదని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ చాలా అనుకూలమైన ప్రాంతమని ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ అన్నారు. ఐటి రంగంలో గత రెండేండ్లలో 40 వేల కొత్త ఉద్యోగాలు వచ్చాయన్నారు. కరోనా సమయంలో ఐటి రంగ్ంట అందించిన సహకారం మరువలేనిదని చెప్పారు.