Friday, November 22, 2024

ఆస్కార్ రిమైండర్ జాబితాలో ఆర్‌ఆర్‌ఆర్, కాంతారా, గంగూబాయ్ కథియావాడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్‌కు అర్హమైన 301 ఫీచర్ ఫిలిమ్స్ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఎస్‌ఎస్. రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్, సంజయ్ లీలా బన్సాలీ తీసిన గంగుబాయ్ కథియావాడీ, వివేక్ అగ్నిహోత్రి తీసిన ద కశ్మీరీ ఫైల్స్, రిషబ్ శెట్టి నటించిన కాంతారా ఉన్నాయి. కాగా ఫైనల్ నామినేషన్స్‌ను జనవరి 24న ప్రకటిస్తారు. ఇదిలావుండగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు… పాట కూడా అకాడమీ అవార్డులకు ఎంపికయింది.

ఆర్‌ఆర్‌ఆర్ రెండు విభాగాల్లో పోటీపడుతున్నది. ఒకటి నాన్ ఇంగ్లీషు చిత్రం విభాగంలో, రెండోది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో.
95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం 2023 మార్చి 12న లాస్ ఏంజెల్స్‌లోని డాలీ థియేటర్‌లో జరుగనున్నది. ఈ ఏడాది ఆస్కార్ ప్రదానోత్సవాన్ని టివి ప్రెజెంటర్ జిమ్మీ కిమ్మెల్ హోస్ట్ చేస్తారు.

గతంలో కూడా భారతీయ చిత్రాలు జల్లికట్టు, కోలంగల్, గల్లీ బాయ్, విలేజ్ రాక్‌స్టార్స్, న్యూటన్, విసారనయ్ ఆస్కార్ పోటీకి వెళ్లాయి. కానీ అవి ఎంపికే కాలేదు. ఇప్పటి వరకు ఆస్కార్‌కు నామినేట్ అయిన భారతీయ చిత్రాలు: మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News