- Advertisement -
డెహ్రాడూన్: జోషిమఠ్‌లో భూమి కుదించుకుపోయిన తర్వాత ఇప్పుడు ఉత్తరాఖండ్‌కు చెందిన కర్ణ్‌ప్రయాగ్‌లోని బహుగుణా నగర్, సీఎంపీ బెండ్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ ప్రాంతాల్లో ఇళ్ల గోడలు బీటలు పడ్డాయి. బదరీనాథ్ ఒడ్డున ఉన్న ప్రాంతాలలోని 25 ఇళ్లకు బీటలు పడ్డాయి. కనీసం రెండు అడుగు మేరకు గోడలకు బీటలు పడ్డాయి. అయినప్పటికీ ప్రజలు ఈ ఇళ్లలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. భూమి దిగపడిపోతున్న అధికార యంత్రాంగం ఏమి చేయడంలేదని అంటున్నారు. కర్ణ్‌ప్రయాగ్‌లో 12 ఏళ్ల కిందట కూరగాయల మార్కెట్ ఏర్పడ్డాక కూడా భూమి కుంచించుకుపోయింది. అప్పటి నుంచే గోడల్లో బీటలు పడ్డం మొదలయింది. ఇదే సమయంలో కర్ణ్‌ప్రయాగ్‌నైనీసైణ మార్గంలో రాకపోకలను కూడా ఆపేశారు. ఆ తర్వాత రోడ్డపై వచ్చిన వర్షపు నీరు ఇళ్లకు మళ్లింది.
- Advertisement -