టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత అందం గురించి ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ‘ఆమె అందం తగ్గిపోయింది. సమంతను చూస్తే బాధేస్తోంది’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సమంతకు మద్దతుగా నిచిచాడు. ‘ మీరు దేనికీ బాధపడనక్కర్లేదు. కేవలం క్లిక్‌బైట్ కోసమే ఆలోచిస్తారు. మీకు గ్లో కావాలంటే.. ఇన్స్టాగ్రామ్ లో ఫిల్టర్స్ ఉన్నాయి. ఒక్కసారి సామ్ ను కలవండి.. తన గ్లో ఏంటో మీకే తెలుస్తోంది’ అని వరుణ్ తన ట్వీట్టర్ లో ఘాటు రిప్లై ఇచ్చాడు. సామ్ మైయోసిటిస్ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.
U don’t feel bad abt anything u just care about clickbait feel bad for u son. Also glow is avaliable in instagram filters. Jsut meet Sam trust me she was glowing . 🙏 https://t.co/JRslCKYJpP
— VarunDhawan (@Varun_dvn) January 10, 2023