Friday, December 20, 2024

పాకిస్థాన్‌లో చైనీయులకు భద్రత కల్పించాలి: చైనా విదేశాంగ మంత్రి

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనా కొత్త విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గ్యాంగ్ అధికారికంగా తొలి ఫోన్‌కాల్‌ను పాక్ విదేశాంగ మంత్రికి బిలావల్‌కు చేశారు. పాకిస్థాన్‌లో పనిచేస్తున్న చైనాకు చెందిన కార్మికులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని బిలావల్ భుట్టో జర్దారీని క్విన్ కోరారు. చైనా విదేశాంగ మంత్రిగా వాంగ్ యి స్థానాన్ని భర్తీ చేసిన క్విన్ జనవరి 9న పాక్‌కు ఫోన్ చేశారని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని విదేశాంగశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇరుదేశాల మధ్య మిత్ర బంధం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు చైనా కొత్త సంవత్సరానికి కొద్దిరోజుల ముందు పాక్ విదేశాంగ మంత్రికి ఫోన్ చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఉన్న చైనా పౌరుల భద్రతకు పటిష్ఠ చర్యలు పాక్ ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా, 60బిలియన్ డాలర్ల వ్యయంతో చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ భాగంగా పలు ప్రాజెక్టుల్లో వందలాదిమంది చైనా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిపై తరుచు దాడులు జరుగుతుండటంతో చైనా కార్మికుల భద్రత అంశం చైనా ప్రభుత్వానికి ఆందోళనకరంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News