Monday, December 23, 2024

గీతా ఆర్ట్స్ లో గుర్తుండిపోయే సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’.. టీజర్

- Advertisement -
- Advertisement -

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. “ఈ సినిమా కథ చెప్పినప్పుడే ఈ టైటిల్‌ను చెప్పాడు దర్శకుడు మురళి కిషోర్. కథ మొత్తం అయిపోయిన తరువాత నన్ను ఈ డైరెక్టర్ అడిగాడు ‘దీనిలో ఏమైనా దేవుడు ఎలిమెంట్ ఉంది అనుకుంటున్నారా’ అని. నేను ఉంది కదా అని చెప్పాను. విష్ణు తత్త్వం క్లారిటీగా కనిపిస్తుంది. ఒక మనిషి చిరునవ్వుని, అవతలవాడికి సాయం పడే విధానాన్ని ఇంత కమర్షియల్‌గా చెప్పుకుంటూ వచ్చారని చెప్పాను.

ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్‌కు కూడా ఇండస్ట్రీ పెద్దలనుంచి మంచి స్పందన వచ్చింది”అని తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “గీతా ఆర్ట్ లో సినిమా చేయడం వేరు, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా చేయడం వేరు. ఇలా ఎందుకు చెబుతున్నానో ఫిబ్రవరి 17న అర్ధమవుతుంది. గీతా ఆర్ట్‌లో గుర్తుండిపోయే సినిమా ఇదవుతుంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కశ్మీర పర్దేశీ, దర్శకుడు మురళి కిషోర్, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరత్వాజ్, కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News