Monday, December 23, 2024

బాదములతో ఆరోగ్యవంతమైన పండుగను వేడుక చేయండి!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హార్వెస్ట్‌ పండుగను ప్రపంచవ్యాప్తంగా వేడుక చేసుకుంటారు. విభిన్న ప్రాంతాలలో విభిన్న పంట కాలాలకు అనుగుణంగా ఈ పండుగను వేడుక చేసుకోవడం కనిపిస్తుంటుంది. భారతదేశంలో, దాని వైవిధ్యత కారణంగా ఈ పండుగను పలు మార్గాలుగా వేడుక చేస్తుంటారు. అయితే, దాని స్ఫూర్తి మాత్రం అదే రీతిలో ఉంటుంది. దీనిని మాఘి అని అంటారు. ఉత్తర భారతదేశంలో లోహ్రీ కంటే ముందుగా వస్తుంది. ఈశాన్య రాష్ట్రాలలో మాఘ్‌ బిహు అంటే, పశ్చిమ భారత్‌లో ఉత్తరాయణ్‌ అని దక్షిణ భారతదేశంలో పొంగల్‌, మకర సంక్రాంతి అని దక్షిణ మరియు తూర్పు భారతదేశంలో అంటారు. విజయవంతంగా పంట సాగు చేయడంతో సహకరించిన ప్రకృతి మాతకు ధన్యవాదములు తెలుపుతూ చేసుకునే ఈ పండుగ వేళ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి పండిప పంటతో పిండి వంటలతో సంతోషాన్ని వేడుక చేసుకుంటారు.

ఈ సందర్భాలలో, సంప్రదాయాలు నిర్ధేశించడంతో మనం ఎన్నో స్వీట్లు, ఇతర రుచులు ఆస్వాదిస్తుంటాము. అయితే, ఈ వేడుకలకు కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు, మీ స్నేహితులు, కుటుంబసభ్యులకు స్వీట్లతో కూడిన బాక్స్‌ అందించడంకు బదులుగా మీరు ఓ బాక్స్‌ బాదములను అందించవచ్చు. అంతేకాదు, బాదములంటేనే చక్కటి ఆరోగ్య బహుమతి. అవి ఆరోగ్యవంతమైన బహుమతి కోసం ఈ సందర్భాలలో ప్రత్యామ్నాయంగా చెప్పబడుతుంది. బాదములలో మెగ్నీషియం, రాగి, డైటరీ ఫైబర్‌, అధిక ప్రోటీన్‌లు ఉంటాయి. వీటితో పాటుగా రోగ నిరోధక శక్తి పెంపొందించే యాంటీ ఆక్సిడెంట్‌ విటమిన్‌ ఈ కూడా ఉంది. బాదములలో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్‌ కూడా అధికంగా ఉంది. ఒకరి ఆరోగ్యానికి ఇది చక్కగా తోడ్పడుతుంది. బాదములను తినడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వీటిలో గుండె ఆరోగ్యం మెరుగుపడటం , టైప్‌ 2 మధుమేహ నిర్వహణ, ఆకలి తీరడం వంటివి ఉన్నాయి.

న్యూట్రిషన్‌ మరియు వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ ‘‘ మీరు అభిమానించే వారితో చక్కటి అనుబంధం ఏర్పరుచుకోవడానికి మరియు ప్రేమ, అనుబంధం,సంరక్షణను చూపడానికి తోడ్పడతాయి. కానీ ఆ పండుగలే మన ఆప్రమప్తంగా లేకపోవడానికి, పండుగ ఆహారాన్ని అధికంగా తినడానికి కూడా కారణమవుతాయి. ఈ సమస్యను అధిగమించడం కోసం మేము ఆలోచనాత్మకంగా సాధారణ వేడుకలలో సంప్రదాయ స్వీట్లు మరియు రుచులకు ప్రత్యామ్నాయాలను ఆరోగ్యవంతమైన అవకాశాలతో అందిస్తున్నాము. అలాంటి ఓ అవకాశం బాదములు. సాధారణంగా ఈ బాదములు ఎన్నో భారతీయ వంటకాలలో చక్కగా మిళితమవుతాయి.

అంతేకాదు, భోజనాల నడుమ స్నాక్స్‌గా కూడా తోడ్పడతాయి. బాదములలో గొప్పతనమేమిటంటే, అవి అత్యంత సులభంగా రుచిని అందిస్తాయి. ఎలాంటి మసాలాలు/స్పైసెస్‌తో అయినా ఇవి మిళితం కావడంతో పాటుగా వీటిని రుచికరంగా మరియు ఆరోగ్యవంతమైన అవకాశంగా మీ పండుగ ఆహారానికి నిలుస్తాయి. పరిశోధనలు వెల్లడించే దాని ప్రకారం, బాదములు కార్బోహైడ్రేట్‌ ఫుడ్స్‌ కారణంగా బ్లడ్‌ షుగర్‌ పై పడే ప్రభావాన్ని తగ్గిస్తాయి. సాధారణంగా కార్బోహైడ్రేట్స్‌ వల్ల ఇన్సులిన్‌ స్ధాయి గణనీయంగా పెరుగుతుంది. ఆరోగ్యవంతమైన డైట్‌లో భాగంగా బాదములు తినడం వల్ల టోటల్‌ మరియు ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ తగ్గించడం వీలవుతుంది మరియు గుండెకు నష్టం చేసే కొవ్వునూ తగ్గిస్తుంది’’ అని అన్నారు.

సుప్రసిద్ధ భారతీయ టెలివిజన్‌, సినీ నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ ‘‘ మా కుటుంబ సంప్రదాయంలో భాగంగా పొంగల్‌ను వేడుక చేసుకుంటాము. అన్ని పండుగల్లాగానే, ఈ పండుగకు కూడా బహుమతులను స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది. అయితే, నేను మాత్రం కాస్త వైవిధ్యంగా, వీలైనంత ఆరోగ్యవంతంగా ఈ బహుమతులు అందిస్తుంటాను. ఈ కారణం చేతనే నేను ఓ బాక్సు బాదములను కూడా దానిలో ఉంచేందుకు ప్రయత్నిస్తుంటాను. బాదములలో విటమిన్‌ ఈ, ఐరన్‌, జింక్‌, ఇతర పోషకాలు ఉంటాయి. అవి రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడటంతో పాటుగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు కూడా ఇలానే చేయాల్సిందిగా నేను ప్రోత్సహించడంతో పాటుగా మీ రోజువారీ డైట్‌లో బాదములను భాగం చేసుకోండి’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News