సేర్ యార్డ్ ఫ్యాక్టరీ
గోల్డెన్ ఫామ్స్ ఎన్‌క్లేవ్ (చేవెళ్ల)
గ్రీన్ సేర్ (చేవెళ్ల)
ప్రైమ్ ఎవెన్యూ వెంచర్(కిష్టాపూర్)
మేజిస్టిక్ విల్లాస్ (రాకంచర్ల)
స్టార్ కాలనీ (రాకంచర్ల)
మనతెలంగాణ/హైదరాబాద్ : అక్రమ వెంచర్లు, ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవాలని రెరా అథారిటీ నిర్ణయించింది. అం దులో భాగంగా రెరా అథారిటీ అనుమతి లేని వెంచర్లు, ప్రాజెక్టుల వివరాలను ఎప్పటికప్పుడు పత్రికల్లో ప్రచురించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పలు వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేయకూడదని రెరా తా జాగా వినియోగదారులను హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే పలు సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్టు రెరా పేర్కొంది. అందులో భాగంగా ఇన్వెస్ట్ ఇన్ ఎకర్స్ అండ్ బెనిఫిట్ ఇన్ స్వ్కేర్ యార్డ్ అంటూ స్వ్కేర్ యార్డ్ ఫ్యాక్టరీ అనే రియల్ సంస్థ అక్రమంగా ప్లాట్ల ను విక్రయిస్తుందని గుర్తించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాల్ని సేకరించిం ది. ఇందులో కొనుగోలుదారులు ప్లాట్ల ను కొనకూడదని రెరా హెచ్చరించింది. దీంతోపాటు చేవేళ్లలో 12 ఎకరాల్లో చేసిన గోల్డన్ పామ్స్ ఎన్‌క్లేవ్, గ్రీన్ స్క్వేర్, కిస్టాపూర్‌లో 10.5 ఎకరాల్లో ప్రైమ్ ఎవెన్యూ వెంచర్, రా కంచర్లలో 11.5 ఎకరాల్లో చేపట్టిన మెజెస్టిక్ విల్లాస్, రాకంచర్లలో 3.5 ఎకరాల్లో చేసిన స్టార్ కాలనీ వంటి వెంచర్లకు స్థానిక సంస్థల నుంచి రెరా చట్టం 2016 సెక్షన్ 3(1), 4 (1) ప్రకారం.. ఎలాంటి అనుమతుల్లేవని రెరా అథారిటీ తెలియజేసింది.
రెరా చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం రెరా నుంచి ఎలాంటి అనుమతి లేవనీ, ఈ సంస్థలు, ప్రాజెక్టుల నుంచి ఎలాంటి ప్లాట్‌లు, ఫ్లాట్లను విక్రయించకూడదని రెరా స్పష్టం చేసింది. ఇక నుంచి రెరా అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, ఇళ్లను విక్రయించకూడదని, అలా అమ్మే సంస్థల నుంచి కొనుగోళ్లు చేయకూడదని రెరా తెలియజేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వాణిజ్య సముదాయాల్లో కొనుగోలు చేసేవారు వాటికి రెరా అనుమతి ఉం దా? లేదా? అనే విషయాన్ని రెరా వెబ్‌సైట్‌లో చూశాకే ముందడుగు వేయాలని రెరా పేర్కొంది.
ప్రస్తుతం రెరా అథారిటీలో సరిపడా సభ్యులు లేకపోవడంతో దళారులకు అది వరంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెరా అనుమతి పొందిన ప్రాపర్టీలను నేరుగా బిల్డర్ లేదా రెరా అనుమతించిన ఏజెంట్ల వద్ద కొనుగోలు చేయాలని రెరా సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించకపోవడం కూడా ప్రజలు మోసపోవడానికి దారితీస్తోంది. ఫ్రీ లాంచ్, ఆన్ డివైడెడ్ సేల్స్ పేరుతో జరిగే మో సాలను కొన్ని వేల మంది ఇప్పటికే బలికాగా మరికొందరు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారని వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అనుమతులు లేని, రెరా రిజిస్ట్రేషన్ లేని….
రెరా చట్టం ప్రకారం బిల్డర్ ఏదైనా ఫ్లాట్/ఆఫీస్ స్థలాన్ని విక్రయించే ముందు సంబంధిత అధికారుల (హెచ్‌ఎండిఏ/జిహెచ్‌ఎంసి) నుంచి భవన నిర్మాణ అనుమతిని పొందాలని గతంలో ప్రభుత్వం ఆదేశించింది. రెరా అథారిటీలో ప్రాజెక్ట్ పేరును నమోదు చేసుకోవాలని, ప్రాజెక్ట్ రెరాతో రిజిస్ట్రర్ కానట్లయితే, సంబంధిత అధికారుల నుంచి అనుమతులు లేని రెరా రిజిస్ట్రేషన్ లేని, ప్రాజెక్ట్‌ల యొక్క ఏవైనా వివాదాలను రెరా స్వీకరించదని ప్రభుత్వం పేర్కొంది. ఏదైనా ప్రాజెక్ట్‌లో ఏదైనా ఫ్లాట్‌లు/ఆఫీసు స్థలాన్ని బుక్ చేసే ముందు హెచ్‌ఎండిఏ/జిహెచ్‌ఎంసితో పాటు రెరా రిజిస్ట్రేషన్ యొక్క వివరాలను తనిఖీ చేయాలని ప్రభుత్వం పేర్కొన్నా తప్పుడు సంస్థలు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కొత్తదారులను వెతకడం గమనార్హం.
ఇప్పటికే చాలా సంస్థల చేతుల్లో మోసపోయిన వినియోగదారులు ఆయా సంస్థలపై ఫిర్యాదు చేసినా వాటిపై రెరా చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటితుడుపు చర్యగా ఐదు, ఆరు సంస్థలపై చర్యలు తీసుకోవడం వెనుక మతలబు ఏమిటనీ వారు ప్రశ్నిస్తున్నారు. ఫ్రీ లాంచ్ పేరితో ఇప్పటికే వేల కోట్లను మోసం చేసిన రియల్‌ఎస్టేట్ సంస్థలైన వాసవి గ్రూప్, సాహితీ సంస్థలతో పాటు మోసాలకు పాల్పడుతున్న సంస్థలపై రెరా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెరా ఫిర్యాదులపై స్పందించక పోవడంతో పలు సంస్థలు వినియోగదారులను మోసం చేయడానికి వెనుకాడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లోని రెరా సంస్థలు వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడంలో ముందుండగా మనదగ్గర దళారులకే పెద్దపీట వేశారని నిపుణులు పేర్కొంటుండడం గమనార్హం.