Saturday, December 21, 2024

భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ :  కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం అశోక్ అనే వ్యక్తి గత 21 రోజుల క్రితం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. అతని భార్య భార్గవి భర్త మరణాన్ని తట్టుకోలేక మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయిందని ఆయన తెలిపారు. ఇది గమనించిన ఆమె తండ్రి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. భార్గవికి మూడు సంవత్సరాల పాప, సంవత్సరం బాబు ఉన్నట్టు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో చిన్నారులు ఇద్దరు అనాధలయ్యారు. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News