Monday, December 23, 2024

ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ..?

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ లో తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కొద్ది మంది హీరోయిన్లలో కమలిని ముఖర్జీ ఒకరు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2004లో వచ్చిన ‘ఆనంద్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కమలిని.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ తర్వాత మళ్లీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘గోదావరి’ సినిమాలోనూ నటించి మెప్పించిన కమలిని.. ఈసారి కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది.

ఈ సినిమా తర్వాత ‘గమ్యం’, ‘జల్సా’, ‘గోపి గోపికా గోదావరి’, ‘గోవిందుడు అందరివాడు’ సినిమాల్లో నటించి అలరించింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన యూత్ ఫుల్ సినిమా ‘హ్యాపీడేస్’లోనూ గెస్ట్ రోల్ చేసింది. కాగా, ‘గోవిందుడు అందరివాడు’ మూవీ తర్వాత సినిమాలకు కమిలిని పూర్తిగా దూరమైంది. దీంతో ప్రేక్షకులు కూడా ఈ హీరోయిన్ ను దాదాపు మర్చిపోయారు. అయితే, చాలా కాలం తర్వాత కమలిని ముఖర్జీ మీడియా కంటపడింది.

Kamalini Mukherjee appear in Dallas

ఒకప్పుడు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోవడాన్ని చూసి అందరూ అశ్చర్యపోతున్నారు. తాజాగా డల్లాస్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కమలిని మెరిసింది. అయితే, మునుపటిలా నాజూగ్గా కాకుండా చాలా బొద్దుగా కనిపించింది. బాగా లావు పెరగడంతో.. ఈమెను ఎక్కడో చూసినట్లు ఉంది అనుకునేలా మారిపోయింది. ఎంతో అందంగా ఉండే హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ అని ఆశ్చర్యపోతూ నెటిజట్లు కామెంట్స్ చేస్తున్నారు.

Kamalini Mukherjee appear in Dallas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News