హైదరాబాద్ : ఈ నెల 18న ఇండియా వర్సెస్ న్యూజిల్యాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. మొదటి వన్డే మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాందీ ఇంటర్‌నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్ కోసం సీహెచ్‌సీఏ ఏర్పాట్లు చేస్తున్నది. 13వ తేదీ నుంచి భారత్ – న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు.
కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లను విక్రయిస్తున్నామని, ఆఫ్‌లైన్‌లో విక్రయించడం లేదని స్పష్టం చేశారు. అయితే, ఫిజికల్ టికెట్ ఉంటేనే స్టేడియంలోకి అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 15 నుంచి 18 వరకు ఫిజికల్ టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఎల్‌బి స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాల్లో ఫిజికల్ టికెట్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. క్రీడాభిమానులు అందరు సహకరించి మ్యాచ్ ను ఎంజాయ్ చేయాలి అని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కోరారు.