Monday, December 23, 2024

టిఎస్‌పిఎస్‌సి కార్యాలయ ముట్టడి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో 23 వేల పిఈటి పోస్టులు, 45 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున టిఎస్‌పిఎస్‌సి కార్యాలయాన్ని ముట్టడించారు. జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి పిఈటి నిరుద్యోగ సంఘం చైర్మన్ సైదులు గౌడ్ నేతృత్వం వహించారు. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల, కాలేజీ స్థాయిలో వ్యాయామ విద్యను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. వ్యాయామ ఉపాధ్యాయులను భర్తీ చేయకుండా నిర్లక్షం చేస్తున్నారన్నారు. దీని వల్ల ఓలంపిక్స్‌లో మన దేశానికి ఒక్క స్వర్ణ పతకం కూడా లభించలేదన్నారు.

కొరియా, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్, లాంటి చిన్న చిన్న దేశాలు పదుల సంఖ్యలో స్వర్ణ పతకాలు సాధిస్తుంటే ప్రపంచంలోనే గొప్ప దేశమైన మన దేశం ఒక స్వర్ణ పతకం కూడా సాధించకపోవడం సిగ్గుచేటన్నారు. వ్యాయామ విద్య లేకపోవడంతో 25 ఏళ్ళ వయస్సుకే డయాబెటిక్ 30 సంవత్సరాలకే బిపి, 35 సంవత్సరాలకే హార్ట్ అటాక్ వస్తున్నాయన్నారు. మంచి ఆరోగ్యంగా ఉంటేనే విద్యార్థులు చదువులో రాణిస్తారని కృష్ణయ్య తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు గేమ్స్, స్పోర్ట్ క్రమం తప్పకుండా ఉంటే విద్యార్థులకు మంచి ఆరోగ్యం, మంచి చదువు లభిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న పిఇటి, పిడి పోస్టులు భర్తీ చేయలేదని వెంటనే ఈ పోస్టులను భర్తీ చేయాలని డిమాంద్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 24 వేల టీచర్‌పోస్టులను, ఎస్‌షి, ఎస్‌టి, బిసి, మైనారిటీ గురుకులాల్లో 12 వేలు, ఎయిడెడ్ పాఠశాలల్లో 4900, ఆదర్శ పాఠశాలల్లో 2 వేలు, కస్తుర్బా పాఠశాలల్లో 1200,

ప్రభుత్వ పాఠశాలల్లో 4 వేల కంప్యూటర్ టీచర్ పోస్టులు, 10 వేల పిఇటి పోస్టులు5 వేల ఆర్ట్ అండ్ క్రాప్ట్ పోస్టులు మూడు వేల లైబ్రేరియన్, 4 వేల జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 10 వేల అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటన్నింటి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలు, బిఎడ్ కాలేజీలు, డైట్ కళాశాలల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News