Friday, November 22, 2024

రంజీలో పృథ్వీషా 379 రికార్డు పరుగులు … జాతీయ జట్టులోకి తీసుకోవాలి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువ బ్యాట్స్‌మెన్ పృథ్వీషా రంజీ ట్రోఫీలో బ్యాటింగ్ విభాగంలో రికార్డు మోత మోగించాడు. అసోం-ముంబయి మధ్య జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా 383 బంతుల్లో 379 పరుగులు చేయడంతో జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2021లో చివరిసారిగా టీమిండియాతో కలిసి ఒక టి 20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతడికి బిసిసిఐ మొండి చేయి చూపించింది. ప్రస్తుతం అతడు ఫామ్ లో ఉండడంతో జాతీయ జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మాజీ ఫేసర్ వెంకటేష్ ప్రసాద్ తెలిపాడు.

బ్యాటింగ్‌లో షాకు అద్భుతమైన టాలెంట్ ఉండడంతో తీసుకోవాలన్నాడు. గతంలో జట్టు నుంచి ఏ కారణాలతో తప్పించారో తనకు తెలియదన్నారు. ప్రస్తుతం అతడి ప్రదర్శన చూసి టీమ్‌లోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. మేనేజ్‌మెంట్ అతడి మాట్లాడడంతో పాటు బాధ్యత వహిస్తే టీమిండియాకు మేలు జరుగుతుందన్నారు.
పృథ్వీషాకు టాలెంట్ ఉన్నప్పటికి మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే అవకాశాలు తక్కువగా వచ్చాయి. ఐపిఎల్‌లో అదరగొట్టిన జాతీయ జట్టులోకి మాత్రం చోటు కల్పించలేదు. మంచి ఆటతీరు, మైదానం లోపల వెలుపల క్రమశిక్షణగా ఉన్నప్పటి తనకు అవకాశాలు కల్పించలేదని షా ఆవేదన వ్యక్తం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News