న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం గురువారం నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ ప్రకటన ముసుగులో ‘ఆప్’ జారీచేసిన వాణిజ్య ప్రకటనలకుగాను రూ. 163.62 కోట్ల రికవరీ నోటీసులను ఢిల్లీ డిఐపి విభాగం జారీచేసింది. ‘10 రోజుల్లోగా మొత్తం సొమ్ము రూ. 1636188265ను తిరిగి చెల్లించాలని లేకుంటే తదుపరి చర్యలు తప్పవని’ నోటీసులో పేర్కొన్నారు. ఇందులో రూ. 993110053లు 2017 మార్చి 31 వరకు ఖర్చుపెట్టగా, మిగతా రూ. 643078212 అపరాధ వడ్డీ మొత్తం.
ఈ నోటీసుపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా గవర్నర్ వికె. సక్సెనాను నిందించారు. బిజెపి ఎన్నికైన మంత్రులను, అధికారంలోని ఆప్‌ను లక్ష్యంగా చేసుకుందని ట్వీట్ చేశారు. గవర్నర్‌కు అలాంటి ఉత్తర్వులు జారీచేసే అధికారం లేదని అన్నారు. ఇదిలావుండగా ఆప్ ప్రధాన ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వును ‘కొత్త లవ్ లెటర్’ అంటూ కొట్టిపారేశారు. ఢిల్లీ ప్రజలు ఎంతగా దిగులు చెందిందే బిజెపి అంతగా ఆనందపడుతుంది అని వ్యాఖ్యానించారు. చట్టం దృష్టిలో గవర్నర్ ఆదేశాలు చెల్లవు అని అన్నారు.
Officers of Del govt are being misused by LG n BJP, not to do ANY public service work, but to keep targetting elected ministers and ruling AAP.
Thats why they wish to continue their control over “services”.
— Manish Sisodia (@msisodia) January 12, 2023