Saturday, January 4, 2025

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హరితహారం

- Advertisement -
- Advertisement -

పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి…

మఖ్తల్ టౌన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భాగంగా నియోజకవర్గంలోని పలు రైస్ మిల్లుల వద్ద హరితహారంలో కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శివప్రసాద్ రెడ్డి, డీఎం హథిరాం మొక్కలు నాటారు. పట్టణంలోని ఖానాపూర్ రోడ్ లో ఉన్న మహాలక్ష్మీ ఇండస్ట్రీస్, చందాపూర్ వద్ద ఉన్న వాసవీ పవన్ ఇండస్ట్రీస్ తోపాటు ఎస్‌ఎల్ ఎన్ ఇండస్ట్రీస్, మల్లిఖార్జున రైస్ మిల్స్ వద్ద మొక్కలు నాటారు.

హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఎన్‌ఫోర్స్ మెంట్ డీటీ గురురాజారావు, జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, రైస్ మిల్లర్స్ యజమానులు కాల్వ శ్రీనివాస్, బిలకంటి నర్సయ్య, దొంత నరహరి, ఉదయ్, బిలకంటి జగదీశ్, పవన్ కుమార్, రాఘవేంద్ర, తమ్మన్న, క్రిష్ణ, రాజు, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News