Monday, December 23, 2024

నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: రెండో వన్డే మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 216 లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు లంక బౌలర్లు షాకిచ్చారు. లైన్ అండ్ లెంగ్త్ బంతులతో భారత బ్యాట్స్ మెన్లను కట్టడి చేయడంతోపాటు కీలక వికెట్లు పడగొట్టారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(17), శుభమన్ గిల్(21), విరాట్ కోహ్లీ(04), శ్రేయస్ అయ్యర్(28)లను లంక బౌలర్లు పెవిలియన్ చేర్చి టీమిండియాపై ఒత్తిడి పెంచారు. దీంతో 86 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం భారత్ 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో కెఎల్ రాహుల్(12), హర్దిక్ పాండ్యా(04)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News