Monday, December 23, 2024

కేరళలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి… 1800 కోళ్లు మృతి

- Advertisement -
- Advertisement -

కొజికోడ్ (కేరళ): కేరళ కొజికోడ్ జిల్లాలో ప్రభుత్వ నిర్వహణలోని పౌల్ట్రీ ఫాంలో బర్డ్‌ఫ్లూ వ్యాపించి 1800 కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఎక్కువగా విస్తరించే హెచ్5ఎన్1 వేరియంట్ అయిన బర్డ్‌ఫ్లూ పౌల్ట్రీలో వ్యాపించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. స్థానిక ఈ పౌల్టీఫాంను జిల్లా పంచాయితీ నిర్వహిస్తోంది.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తక్షణం నివారణ చర్యలు తీసుకోవాలని కేరళ పశుసంవర్ధక మంత్రి జె. చించురాణి ఆదేశించారు. కచ్చితంగా గుర్తించడానికి ఈ నమూనాలు భోపాల్ లోని లాబ్‌కు పంపారు. ఈ పౌల్ట్రీ ఫాంలో మొత్తం 5000 కోళ్లు ఉండగా 1800 చనిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News