- Advertisement -
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో నేషనల్ పోలీస్ అకాడమీ లో దొంగతనం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన IPS ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అకాడమీ లో ఉన్న కంప్యూటర్లు మాయం అయ్యాయి. అకాడమీలో భద్రతా బలగాల కళ్లు గప్పి 7 కంప్యూటర్లను మాయం చేశారు. కట్టుదిట్టమైన భద్రత కలిగిన IPS ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నుండి ఇంటి దొంగనే చాకచక్యంగా కంప్యూటర్లు దొంగలించాడు.
శుక్రవారం కంప్యూటర్లు మాయం అయిన విషయాన్ని గమనించిన అధికారులు సి. సి టివి ఫూటేజ్ పరిశీలించారు. ఫూటేజ్ లో దొంగతనం దృశ్యాలు రికార్డు అయ్యాయి. దాంతో అకాడమీ లో ఐటి సెక్షన్ లో పని చేస్తున్న చంద్రశేఖర్ యే దొంగతనానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో NPA అధికారులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
- Advertisement -