- Advertisement -
హైదరాబాద్ పాతబస్తీలో శుక్రవారం లంచం తీసుకుంటూ ఓ పోలీస్ దొరికిపోయాడు. బహదూర్‌పుర్ పోలీస్ స్టేషన్ లో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఎస్సై శ్రవణ్ సీజ్ చేసిన మొబైల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేయడానికి ఫిర్యాదుదారు నుండి రూ.8000 లంచం తీసుకుంటుండగా ఎసిబికి పట్టుబడ్డాడు. లంచం తీసుకుంటుండగా ఎసిబి అతడిని పట్టుకుంది. ఎస్సై శ్రవణ్ నివాసంలో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.
- Advertisement -