- Advertisement -
తెలంగాణలో కొన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకుని చివరి ఎకరా వరకు నీరు అందిస్తుంది. తెలంగాణ సాగునీటి రంగంలో మరో ముందడుగు పడింది. ఛనాక , కొరాట బ్యారేజీకి పర్యావరణ అనుమతులు లభించాయి. ఈమేరకు కేంద్ర పర్యావరణ , అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతుల సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జలవనరుల శాఖకు అధికారికంగా పంపింది. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ జిల్లా తాంసీ, బేలా మండలాల్లోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
- Advertisement -