Friday, November 22, 2024

విద్యుత్ లైన్లతో జాగ్రత్త: సీఎండి రఘుమారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేసటప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని టిఎస్‌ఎస్‌పిడీసీఎల్ (దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ) సీఎండి రఘుమారెడ్డి సూచించారు.ముఖ్యంగా విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. విద్యుత్ లైన్లకు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండి ఎగురవేయాలని లేని పక్షంలో పతంగులకు వినియోగించే మాంజా దారం వాటిపై విద్యుత్ అంతరాయాలు సంభవించడమే కాకుండా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందన్నారు.

కాటన్, నైలాన్, లినెట్‌తో చేసిన మాంజాలను వినియోగించాలని, మెటాలిక్ మాంజాలు వినియోగిస్తే విద్యుత్ వాహకాలుగా మారి ప్రమాదాలు సంభవిస్తాయని ఆయన హెచ్చరించారు. పతంగులు కాని మాంజాలు కాని విద్యుత్ లైన్లపై పడితేవాటిని తొలగించే ప్రయత్నం చేయవద్దని వాటిని వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. బాల్కనీ, గోడల నుంచి పతంగులు ఎగురవేయవద్దని అది చాలా ప్రమాదకరమన్నారు. పతంగులు ఎగురవేసేటప్పుడు పెద్దవాళ్ళ పిల్లలను గమనించాలని, వారిని తెగి కింద పడ్డ విద్యుత్ వైర్లను తాకన్విద్దని సూచించారు. ఒక వేళ విద్యుత్ వైర్లు,విద్యుత్ పరికరాలపై వైర్లు తెగిపడి ఉంటే వాటిని తాకుకుండా వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు కాని లేదా 1912 టోల్ ఫ్రీం నెంబర్ ద్వారా తెలియ చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News