Monday, December 23, 2024

లారీని ఢీకొన్న బస్సు..10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి : మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో శుక్రవారం ఉదయం ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో 10మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 22మందికి గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రైవేటు టూరిస్ట్ బస్సులో థానే జిల్లాలోని ఉన్న ఓ కంపెనీకి చెందిన 45మంది ఉద్యోగులు ప్రయాణిస్తున్నారు. వీరంతా అహ్మద్‌నగర్‌లోని షిర్డీకి వెళుతుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు మీడియాకు తెలిపారు. మృతుల్లో ఆరుగురు అంబర్‌నాథ్ తాలుకాలోని గ్రామానికి చెందినవారని స్థానిక అధికారి వెల్లడించారు.

నాసిక్‌అహ్మద్‌నగర్ రోడ్డులో ఉదయం ఆరుగంటలకు ప్రమాదం జరిగింది. ముంబయికి దూరంలో యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు ప్రమాదంలో మరణించినవారిలో ఏడుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు, ఓ వ్యక్తి ఉన్నారని స్టేట్ కంట్రోల్‌రూమ్ అధికారులు తెలిపారు. ప్రధాని మోడీ బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి రెండులక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఒక్కో మృతుని కుటుంబానికి తెలిపారు. గాయపడిన ఒక్కొక్కరికి రూ.50వేలు అందజేయనున్నామని పిఎంఓ తెలిపింది. మహారాష్ట్ర సిఎం ఒక్కో కుటుంబానికి నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News