Friday, December 20, 2024

‘ఆదిపురుష్’పై మరో వివాదం.. సెన్సార్ బోర్డుకు కోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాపై మరో వివాదం వెలుగులోకి వచ్చింది. సెన్సార్ బోర్డ్ నుండి సర్టిఫికేట్ పొందకుండానే చిత్ర నిర్మాతలు ఆదిపురుష్ సినిమా ప్రోమోను విడుదల చేశారని, ఇది నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో కుల్దీప్ అనే వ్యక్తి పేర్కొన్నారు. సినిమాలో సీతా దేవి పాత్రను పోషిస్తున్న కృతి సనన్ దుస్తులపైనా కూడా పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్ ను విచారణకు స్వీకరించిన కోర్టు సెన్సార్ బోర్డుకు నోటీసులు పంపింది. అలహాబాద్ హైకోర్టు ప్రభాస్ సినిమాపై పిల్‌పై సమాధానం ఇవ్వమని సెన్సార్ బోర్డుని కోరింది. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాపై చాలా వివాదాలు నెలకొంటున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News