Monday, December 23, 2024

మొబైల్ కొనివ్వలేదని భార్య బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో  భర్త సెల్ ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. వాంకిడి ఎస్ఐ సాగర్ తెలిపిన వివరాల మేరకు వాంకిడి మండల కేంద్రానికి చెందిన మీర్జా జావీద్ బేగ్ కు అంజుం బేగం కు గత ఐదు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు, జీవనోపాది కీసం కూలి పని చేస్తూ వాంకిడి మండలంలో వీరి కుటుంబం జీవిస్తున్నారు.

గత కొంత కాలంగా భార్య సెల్ ఫొన్ కొనివ్వమని భర్తను పదే ఒదే అడగడం, భర్త తన వద్ద డబ్బులు లేవని చెప్పుతూ వస్తున్నాడు. ఎంతకీ సెల్ ఫోన్ కొనివ్వకపోయేసరికి తీవ్ర మనస్తాపానికి గురైన భార్య అంజుం బేగం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సాగర్ తెలిపారు‌.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News