Thursday, December 19, 2024

బాబు సైకో… పవన్ రబ్బర్ సింగ్: రోజా

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టిడిపి అధినేత, చంద్రబాబు నాయుడు సైకోకు పరాకాష్టగా మారారని మంత్రి రోజా మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలపై రోజా రీకౌంటర్ ఇచ్చారు. జనం రాకపోవడంతో రోడ్లపై సభలు పెడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్‌కు పదవులే ముఖ్యమని మండిపడ్డారు. రెండు చోట్ల ఓడిన పవన్‌ను చూసి ఎవరూ భయపడరని, పవన్ సినిమాల్లో గబ్బర్ సింగ్ అని, రాజకీయాల్లో రబ్బర్ సింగ్ అని దుయ్యబట్టారు. పవన్ ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేడని, తనని డైమండ్ రాణి అని అన్నారని, తాను నిజంగానే రాణినేనని, ఇంట్లో, రాజకీయంగా, నటిగా తనని తాను నిరుపించుకొని రాణిలా ఉన్నానని చెప్పారు. మరోసారి పవన్ తన గురించి మాట్లాడితే బాగుండదని రోజా హెచ్చరించారు. చిరంజీవి తనకు ఎలాంటి గొడవలు లేవన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News