- Advertisement -
పాట్నా: భోజనం చేస్తుండగా గుండె, ఊపిరితిత్తులకు మధ్యన దంతం ఇరుక్కోవడంతో ప్రాణాల మీదికి వచ్చిన సంఘటన బిహార్ రాష్ట్రం బెగుసరాయ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సురేంద్ర కుమార్ (45) అనే వ్యక్తి దవడకు కృత్రిమ దంతం పెట్టించుకున్నాడు. ఆహారం తింటుండగా దంతం ఊడి గొంతులోకిపోయింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేసి దంతం ఆహారం నాళం నుంచి నేరుగా ఊపిరితిత్తులు, గుండె మధ్యలో చిక్కుకపోయింది. వెంటనే ఆపరేషన్ చేసి దంతాన్ని బయటకు తీశారు. ఇప్పడు అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఛాతీలో ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు.
- Advertisement -