Sunday, November 24, 2024

మూడో వన్డేలో లంకపై 317 పరుగులతో భారత్ ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

మూడో వ‌న్డేలో పర్యాటక జట్టు శ్రీలకంపై టీమిండియా రికార్డు విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్(116), విరాట్ కోహ్లీ (166 నాటౌట్)లు సెంచ‌రీల‌తో చెల‌రేగగా.. ఓపెన‌ర్‌ రోహిత్ శ‌ర్మ(42), శ్రేయస్ అయ్య‌ర్(38)లు ఫర్యాలేదనిపించారు. అనంతరం 391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంకను మ‌హమ్మ‌ద్ సిరాజ్ చావు దెబ్బ కొట్టాడు. న‌వ‌నిదు ఫెర్నాండో(19), కుశాల్ మెండిస్(4), ఆవిష్క ఫెర్నాండో(1), చ‌రిత అస‌లంక(1)ల‌ను ఔట్ చేసి లంక జట్టును కుప్పకూల్చాడు.

సిరాజ్ తోపాటు మహ్మద్  ష‌మీ, కుల్దీప్ యాద‌వ్ లు కూడా చెలరేగడంతో లంక జట్టు కేవలం 73 ఆలౌటైంది. దీంతో భారత్ 317 ప‌రుగుల తేడాతో లంకను చిత్తు చిత్తుగా ఓడించింది. భార‌త బౌల‌ర్ల‌లో సిరాజ్ 4 వికెట్లు, ష‌మీ, కుల్దీప్ యాద‌వ్ చెరో 2 వికెట్లు తీశారు. మూడు వ‌న్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో రెండు శ‌త‌కాలతో రాణించిన విరాట్ కోహ్లీకి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News