- Advertisement -
హైదరాబాద్: నగరంలో ఓ యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆదివారం అర్థరాత్రి లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీ దర్వాజా, జీఎంకే ఫంక్షన్ హాల్ ఎదురుగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉప్పల్‌కు చెందిన కలీమ్(25) అనే యువకుడుపై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం దావఖానాకు తరలించారు.అయితే, కలీమ్‌ను హత్య చేసింది తామే అంటూ ముగ్గురు వ్యక్తులు గోల్కొండ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -