Monday, December 23, 2024

పేకాట ఘర్షణలో యువకుడు హత్య

- Advertisement -
- Advertisement -

కృష్టా జిల్లాలలోని అవనిగడ్డలో పేకాట ఘర్షణలో యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అవనిగడ్డలో కరకట్ట కింద నిర్వహిస్తున్న పేకాట బరిలో సీతాయిలంకకకు చెందిన మేడికొండ అనిల్ పై కత్తులు రాడ్లతో నాగరాజు, మరికొంత మంది దుండగులు దాడి చేశారు. తీవ్రగాయాపాలైన ఆ వ్యక్తిని విజయవాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. గుంటూరు జిల్లా గొరికపర్రుకు చెందిన నాగరాజుకు, అనిల్ కు గతంలోని విభేధాల నేపథ్యంతో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News