- Advertisement -
హైదరాబాద్ నగరంలో పండుగ పూట విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. హైదరాబాద్ లోని తార్నాకలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఓ మహిళ, నాలుగేళ్ల బాలిక, దంపతులు ఉన్నారు. మృతులు ప్రతాప్, సింధూర, ఆద్య,ప్రతాప్ తల్లిగా గుర్తించారు. వారి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
- Advertisement -